జర్మనీకి వెళ్లే భారత పౌరులకు శుభవార్త. గతంతో పోలిస్తే వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుందని తెలుస్తోంది. రెండు నుంచి ఐదు రోజుల్లో వీసా అపాయింట్‌మెంట్ అందుబాటులోకి వస్తుందని భారత్‌లోని జర్మన్ ఎంబసీ తెలిపింది. జర్మనీలో కార్మికుల కొరతను అధిగమించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫాస్ట్ సర్వీసులతో తక్కువ సమయంలో వీసాలు మంజూరు చేస్తున్నామని తెలిపింది.
