UPDATES  

 కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. రూ.10 కోట్ల ఆస్తినష్టం..

కామెరెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్థరాత్రి 11.30 గంటల సమయంలో మంటలు చెలరేగగా.. అవి క్రమంగా నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో మాల్ లో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

 

జేసీబీ సహాయంతో షాపింగ్ మాల్ షట్టర్లను తొలగించి మంటలను ఆర్పివేశారు. ఉదయం 7 గంటల వరకూ రెండు అంతస్తుల్లో మంటలు అదుపులోకి రాగా.. మిగతా రెండంతస్తుల్లో మంటలు పూర్తిగా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో సుమారు రూ.8-10 కోట్ల వరకూ ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా షాపింగ్ మాల్ కు నిప్పంటించారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో షాపింగ్ మాల్ పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !