UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 స్మోకింగ్ చేయకున్నా లంగ్ కేన్సర్‌..

లంగ్ కేన్సర్.. స్మోకింగ్ అలవాటు లేని వారిని సైతం కబళించే వ్యాధి. ఇందుకు తాజా దృష్టాంతంగా అమెరికా నటి, కమెడియన్ కేట్ మకూచి నిలుస్తారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ చిత్రంలో లూసీ పాత్రను 43 ఏళ్ల మకూచి పోషించారు. ఊపిరితిత్తుల కేన్సర్‌ నుంచి బయటపడేందుకు గత వారమే సర్జరీ చేయించుకున్న ఆమె.. సిగరెట్ పొగ అన్నదే ఎరగదు.

 

ప్రపంచాన్ని పీడిస్తున్న రెండో అతి పెద్ద కేన్సర్ ఇదే. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా లంగ్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోనూ ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ కేన్సర్ కేసుల పెరుగుదలకు కారణాలు ఎన్నో. టుబాకో స్మోకింగ్, ఇంటిలోపల వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం వంటివి వాటిలో కొన్ని.

 

స్మోక్ చేసినా, చేయకున్నా.. ప్రతి 16 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మహిళలు కన్నా పురుషులు ఎక్కువగా లంగ్ కేన్సర్ బారినపడుతున్నారు. యెమెన్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాల్లో ఈ తరహా కేన్సర్ కేసులు తక్కువ. పాక్‌లో ప్రతి లక్ష మందిలో ఆరుగురు మాత్రమే ఊపిరితిత్తుల కేన్సర్‌ బారినపడుతున్నారు.

 

లంగ్‌కేన్సర్‌తో అత్యధికంగా విలవిలలాడుతున్న దేశం సెర్బియా. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చి ఆన్ కేన్సర్(IARC) గణాంకాల మేరకు కేసుల రేటు 50గా ఉంది. 1990-2008 మధ్య ఈ కేన్సర్ 27.4% పెరిగింది. హంగరీ(కేన్సర్ రేటు 49.8), మాంటినెగ్రో(41.2), ఫ్రెంచి పోలినేసియా(38.5), బోస్నియా అండ్ హెర్జిగోవ్నియా(కేసుల రేటు 38.%) దేశాల్లోనూ ఊపిరితిత్తుల కేసులు ఎక్కువే. వ్యాధి పట్ల చైతన్యం పెంపొందించడంతో పాటు ముందుగానే వ్యాధిని నిర్ధారించుకోవడం ద్వారా లంగ్ కేన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !