సలార్ సినిమాపై కన్నడ హీరో దర్శన్ నోరు జారారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘కాటేరా’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. సినీ ప్రమోషన్స్‌లో సలార్, డంకీ సినిమాలు ముందు రిలీజ్ అవుతున్నాయి. వాటి ప్రభావం మీ సినిమాపై ఉండదా? అని రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి ఆయన.. ‘ఎవరో వస్తే నేనేందుకు భయపడాలి. పక్క ఇండస్ట్రీ నుంచి వస్తున్న వాళ్లు మనల్ని చూసి భయపడాలి.’ అని అన్నారు. దాంతో ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు.
