UPDATES  

 ‘యానిమల్’ లో నటించేందుకు త్రిప్తి డిమ్రి ఎంత తీసుకుందో తెలుసా..?

రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబో లో వచ్చిన యానిమల్ మూవీ డిసెంబర్ 1 న విడుదలైంది. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించి మెప్పించింది. రష్మిక తో పాటు యానిమల్ లో మరో హీరోయిన్ త్రిప్తి డిమ్రి జోయా అనే పాత్రలో నటించింది. రణ్‌బీర్ కపూర్ తో కొన్ని హాట్ సీన్లలో నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

 

జోయా పాత్ర కోసం త్రిప్తి తీసుకున్న పారితోషికం రూ.40 లక్షలు అని లైఫ్‌స్టైల్ ఏషియా తన రిపోర్టులో వెల్లడించింది. యానిమల్ మూవీలో ఆమె పాత్ర ఎంతోమందిని ఆకట్టుకుంది. తాజాగా ఐఎండీబీ విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో త్రిప్తి టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం. ఆమె తర్వాత స్థానంలో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు.

యానిమల్ మూవీతో ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన త్రిప్తి అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాలో ఆమె చాలా బోల్డ్ పాత్రలో కనిపించింది. వాస్తవానికి ఈ చిత్రంలో నటించినందుకు రష్మిక తీసుకున్న పారితోషికం ఇది కేవలం పదోవంతు మాత్రమే రష్మిక రూ.4 కోట్లు అందుకుంది.

 

హీరో రణ్‌బీర్ కపూర్ రూ.70 కోట్లు, విలన్ బాబీ డియోల్ రూ.4 కోట్లు, అనిల్ కపూర్ రూ.2 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. యానిమల్ ద్వారా త్రిప్తికి వచ్చిన డబ్బు తక్కువే అయినప్పటికీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఏకంగా 30 లక్షలు పెరిగారు. యానిమల్ సినిమా విడుదలకు ముందు 6 లక్షలుగా ఉన్న ఫాలోవర్లు గురువారానికి (డిసెంబర్ 14) ఏకంగా 37 లక్షలకు చేరడం విశేషం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !