బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిషేధించేందుకు అక్కడి ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన చర్చలను ప్రభుత్వ వర్గాలు గోప్యంగా ఉంచుతున్నాయి. సోషల్ మీడియా వల్ల చిన్నారులకు ఏ మేరకు హాని కలుగుతోందనే దానిపై జనవరి నుంచి సంప్రదింపులు జరపాలని మంత్రులు యోచిస్తున్నారు.
