లోక్‌సభలో జరిగిన దాడి కేసులో మరో వ్యక్తిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన మహేష్ కుమావత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రకటన చేశారు. ప్రధాన నిందితుడు లలిత్ ఝాకు మహేష్ సాయం చేశాడని పేర్కొంటూ ఈ కేసులో ఆరో నిందితుడిగా అతని పేరును చేర్చారు.
