2023 ఏడాదిలో చైనాను దాటేసి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. భారతదేశ జనాభా దాదాపు 1.43 బిలియన్లు (ఒక బిలియన్ అంటే వంద కోట్లు). రాబోయే దశాబ్దాల్లోనూ భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగే అవకాశాలున్నాయి. 2023, సెప్టెంబర్ 9-10 తేదీలలో భారత్ జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది.
