గూగుల్ మ్యాప్ మరింత సౌకర్యవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గూగుల్ కంపెనీ ప్రకటించింది. ప్రయాణికులు ఇంధనాన్ని మరింతగా ఆదా చేసుకునేందుకు రూట్ ఆప్షన్ ఫీచర్ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. దీని ప్రకారం. వాహనం ఇంజిన్ను అనుసరించి ఎకో ఫ్రెండ్లీ రూట్ (ఇంధనం ఖర్చు తక్కువ అయ్యే మార్గం), ఎక్కువ ఇంధనం తీసుకునే ‘ఫాస్టెస్ట్ రూట్’ను గూగుల్ మ్యాప్ చూపుతుందట.
