కరోనా సంక్షోభం, తదనంతర పరిస్థితులతో అనేక దేశాలు ఆర్థిక మాంద్యం దిశగా పయనిస్తున్నాయి. అయితే, కెనడా ప్రభుత్వం ఆర్థిక స్తబ్ధతను కట్టడి చేసేందుకు ముందుగానే మేల్కొంది. జాతీయ ఉత్పాదకతను పెంచే చర్యల్లో భాగంగా 2025 నాటికి దేశంలో మొత్తం 5 లక్షల మంది వలసదారులు ఉండేలా కెనడా కార్యాచరణ రూపొందించింది. 2023లో వలసదారుల సంఖ్య 4.65 లక్షలు ఉంటే.. 2024లో 4.85 లక్షలు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
