శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా దర్శనం పొందేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) ప్రత్యేక గేటును అందుబాటులోకి తెచ్చింది. ఈ గేటు ద్వారా చిన్నారులు దర్శనం పొందవచ్చు. ఈ గేటు వల్ల పొడవైన క్యూలైన్ల బాధ తప్పిందని టీబీడీ పేర్కొంది. త్వరలోనే వైఫై సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తేవనున్నట్లు టీబీడీ వెల్లడించింది.
