రోజుకో పెగ్ తాగితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది మందుబాబులు చెబుతూ ఉంటారు. తాజాగా దీనిపై WHO నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. రోజుకొక పెగ్ మంచిదే అని చెప్పడానికి పరిశోధనాత్మక ఆధారాలు లేవని స్ఫష్టం చేసింది. మద్యం విష పదార్ధం తప్ప.. మరొకటి కాదని తెలిపింది. దీని కారణంగా పలు రకాల క్యాన్సర్లు, కాలేయ, గుండె సంబంధిత జబ్బులు కూడా వస్తాయని పేర్కొంది.
