ఇండిగో ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది. ఏడాదిలో వంద మిలియన్ మంది ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లిన తొలి భారత విమానయాన సంస్థగా అవతరించడం ద్వారా ఇండిగో చరిత్ర సృష్టించింది. ఈ విజయం సాధించడం ద్వారా ప్రపంచంలోని అతి పెద్ద పది ఎయిర్ లైన్స్ సరసన చేరినట్లు వెల్లడించింది.
