దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. JN.1 వేరియెంట్ కేసులు పెరుగుతుండటంపై అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అలాగే ఆర్టీ పీసీఆర్ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపింది. ఇప్పటికే కేరళలో కొత్త వేరియెంట్ బయటపడగా.. ఈ వేరియెంట్‌తో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు కేరళవాసులు ఉన్నారు.
