ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి మీటింగ్‌కు గంటకు ముందు ఈ సమావేశం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. డిసెంబర్ 19న న్యూఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది.
