రామ్ గోపాల్ వర్మ జనసేన పార్టీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ‘నాకో అద్భుతమైన ఆలోచన వచ్చింది. జనసేన పార్టీ తన పేరును చంద్రసేన పార్టీగా మార్చుకోవాలి. అప్పుడు ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఏపీలో జనసేన, టీడీపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో యువగళం విజయోత్సవ సభకు కూడా పవన్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
