భారతదేశంలోని జాతీయ రహదారులు మార్చి నాటికి ఉపగ్రహ ఆధారిత టోల్లింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో జరిగిన సమావేశంలో గడ్కరీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఢిల్లీ-ముంబై కారిడార్‌లో ప్రయోగాత్మకంగా శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు ఇప్పటికే పూర్తయింది.
