కాచిగూడ-బెంగళూరు నగరాల మధ్య కొనసాగుతున్న వందేభారత్ ప్రయాణ సమయం మరింత తగ్గిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి ఈ రైలు ఇక 8.15 గంటల్లోనే గమ్యం చేరుకోనుంది. ప్రస్తుతం హైదరాబాద్ – బెంగళూరు నగరాల మధ్య వందేభారత్‌లో ప్రయాణ సమయం 8.30 గంటలుగా ఉంది. ఇక తాజా నిర్ణయంతో 8.15 గంటల్లోనే గమ్యం చేరుకోనుంది. దీని ద్వారా ప్రయాణీకులకు 15 నిమిషాల సమయం కలిసి రానుంది.
