దేశంలో కరోనా వైరల్ జేఎన్.1 వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 358 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి పెరిగింది. కొత్త వేరియంట్ ప్రధానంగా కేరళ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 300 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు.