మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం లోని గురుదేవ్ విద్యాలయం నందు గణిత దినోత్సవను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. మొదటగా ప్రధానోపాధ్యాయులు గిరి అకడమిక్ – కో – ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం వారు శ్రీనివాస రామానుజo చిత్ర పటానికి పూల మాల వేసి గణిత దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణిత దినోత్సవాన్ని మ్యాథ్స్ హెచ్ ఓ డి బి. మేఘన , గణిత బోధన సిబ్బంది పి. స్వాతి , మౌనిక , నిఖిత , ఇందిరా, భార్గవి విధ్యార్ధులతో కలసి ఘనంగా ప్రారంభించారు. సుమారుగా 200 మంది విద్యార్ధులు 80 మాథ్స్ ప్రాజెక్ట్ వర్క్స్ ను ప్రదర్శించారు. ఈ గణిత ప్రాజెక్టు ప్రదర్శనను విద్యార్థులు అందరూ సందర్శించి అవగాహన చేసుకున్నారు. అద్భుతమైన ప్రాజెక్టు వర్క్ చేసిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయు గిరి, కోఆర్డినేటర్ సుబ్రమణ్యం తో పాటుగా ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గణిత బోధన సిబ్బంది , విద్యార్ధులను తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.