మన్యం న్యూస్ గుండాల: వంతెన పూర్తి కాదు రహదారి రాత మారదు. గుండాల మండలం ఆళ్లపల్లి మండలాలకు వారధిగా నిలుస్తుందని కిన్నెరసాని వాగుపై నిర్మాణం చేపట్టిన వంతెన పూర్తి కాకపోవడంతో రహదారి కష్టాలు తీరడం లేదు. గుండాల నుండి ఆళ్లపల్లి, కొత్తగూడెం వెళ్లడం కోసం తక్కువ దూరం ఉండడంతో ప్రజలు ఈ దారి గుండాన్ని నిత్యం ప్రయాణించేవారు దానిని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని చేపట్టింది ఎందుకో కానీ వంతెన పనులు ఆగుతూ సాగుతూ ముందుకు పోవడంతో వంతెన మాత్రం పూర్తి కావడం లేదు. ఈ సంవత్సరం వచ్చిన భారీ వర్షాలకు పూర్తిగా కిన్నెరసాని లో నుండి ప్రయాణానికి అనువుగా లేకపోవడంతో చుట్టు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది కిలోమీటర్లు పెరగడంతో పాటు ప్రయాణ సమయం ఎక్కువగా కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అధికారులు స్పందించి కిన్నెరసాని వాగుపై నిర్మిస్తున్న వంతెనను త్వరగా పూర్తిచేయాలని రెండు మండలాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు
