హైదరాబాద్ లోని చంచల్గూడా జైలు నుంచి బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారు. పల్లవి ప్రశాంత్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో తన నివాసానికి బయలుదేరారు. కాగా, నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్ ను చూసేందుకు చంచల్గూడా జైలుకు అభిమానులు భారీగా చేరుకున్నారు.
