పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా సలార్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ‘మై డియర్ దేవా (ప్రభాస్)కి హృదయపూర్వక అభినందనలు. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కు కుదోస్. ఇదొక రిమార్కబుల్ అచీవ్మెంట్. ఒక ప్రపంచాన్ని సృష్టించడంలో మీరు దిట్ట. పృథ్వీరాజ్, ఆద్య శ్రుతిహాసన్, జగపతిబాబుతో పాటు అందరూ బాగా చేశారు’ అని మెగస్టార్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
