ఏపీ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే, రాజకీయాల నేపథ్యంలో ఉండటంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విడుదలకు వారం రోజులే ఉందనగా రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
