UPDATES  

 హాట్ బ్యూటీతో ఘాటుగా ట్రీట్ ఇస్తున్న గుంటూరు కారం ..

టాలీవుడ్ లో పక్కా కమర్షియల్ మూవీలు చేస్తూ సుదీర్ఘకాలంగా స్టార్ హీరో స్టేటస్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్న నటుడు మహేష్ బాబు. ఎప్పటికప్పుడు విభిన్నమైన కంటెంట్ ఉన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ సంక్రాంతి బరిలో గుంటూరు కారం చిత్రంతో దిగుతున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి మహేష్ బాబు చేస్తున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.

 

మూవీ రిజల్ట్ ఏదైనా సరే.. మహేష్ రేంజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. గుంటూరు కారం చిత్రం అనౌన్స్మెంట్ అప్పటి నుంచి ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ జాప్యం కారణంగా ఎట్టకేలకు సంక్రాంతికి విడుదల కాబోతోంది. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి హైప్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ చిత్రాని.. ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందిస్తున్నారు.

 

పక్కా కమర్షియల్ హంగులతో మహేష్ బాబుని మునిపెన్నడూ చూడని మాస్ యాంగిల్ లో ప్రజెంట్ చేస్తూ గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ మూవీలో మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే నెంబర్ వన్ ఐటమ్ సాంగ్ ఉందని టాక్. ఇప్పటికే గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబు గెటప్ ఇప్పటివరకు చూడనంత మాస్ యాంగిల్ లో మహేష్ ఫ్యాన్స్ కి సంతృప్తిపరిచేలా ఉంది.

 

ఇక ఇప్పుడు మహేష్ బాబు మంచి మాస్ ఐటమ్ సాంగ్ కూడా చేస్తున్నాడు అని తెలిస్తే అభిమానులు ఆగగలరా. ఇక ఈ పాటకు సంబంధించిన ట్యూన్స్ ని ఇప్పటికే థమన్ రెడీ చేశారని తెలుస్తోంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సాంగ్ లో విజయవాడ బ్యూటీ డింపుల్ హయాతిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ చిత్రంలో హయాతి తన అందంతో కుర్ర కారును ఊపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బ్యూటీ రాకతో చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !