బయటి వ్యక్తులు ఇంట్లో లేనప్పుడు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో పిలిస్తే అది నేరం కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ఘటనలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగా కులం పేరుతో దూషించకూడదని జస్టిస్ షమీమ్ అహ్మద్ తెలిపారు. ఓ విద్యార్థిని కులం పేరుతో దూషించారంటూ వచ్చిన అభియోగంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
