దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూజర్ల కోసం ‘న్యూఇయర్ ఆఫర్’ను ప్రకటించింది. 2024లోకి అడుగుతున్న నేపథ్యంలో జియో తన వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను అందించనుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. రూ.2,999 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5GB డేటాను పొందుతారు. న్యూఇయర్ ఆఫర్ సమయంలో రీఛార్జ్ చేసుకుంటే అదనంగా మరో 24 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు.
