UPDATES  

 దిల్లీకి చేరిన ఎయిరిండియా అతి పెద్ద విమానం

దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా తమ కొత్త బ్రాండ్‌ లివరీ కింద తీసుకురాబోతున్న తొలి పెద్ద విమానం ఎ350-900 దిల్లీకి చేరుకుంది. ఈ విమానం ఫ్రాన్స్‌కు చెందిన ఐరోపా విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్‌ టూలూజ్‌ ప్లాంటు నుంచి బయలుదేరి శనివారం మధ్యాహ్నం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానాన్ని వీటీ-జేఆర్‌ఏ కింద నమోదు చేశారు. ఏఐ350 అనే ప్రత్యేక కాల్‌ సైన్‌తో దీన్ని ఆపరేట్‌ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !