మన్యం న్యూస్ గుండాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రైస్తవులకు అందిస్తున్న క్రిస్మస్ కానుకలను గుండాల ఎంపీపీ ముక్తి సత్యం మత పెద్ద పాస్టర్ జయరాజు ఆధ్వర్యంలో క్రైస్తవులకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏసుప్రభు కష్టాల నుండి ప్రజలను కాపాడేందుకే డిసెంబర్ 24 అర్ధరాత్రి జన్మించాడని అన్నారు. భారతదేశంలో పాటు ఇతర దేశాల్లో క్రిస్మస్ వేడుకలను ఎంతో అట్టహాసంగా జరుపుతారని అన్నారు. అన్ని మతాలవారు అన్ని కులాల వారు కలిసికట్టుగా భారతదేశంలో అన్ని పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు రాబర్ట్, ఏ సుబ్బు, శాంతయ్య, మోహన్, ప్రభాకర్, శైలజ, విజయ తదితరులు పాల్గొన్నారు
