మన్యం న్యూస్ గుండాల:
గుండాల మండలం లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు మండల కేంద్రంలోని చర్చిలో పాస్టర్ జయరాజు మాట్లాడుతూ క్రీస్తు జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఏసు క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని ఆయన బోధించారు.మనుషుల మధ్య ఐక్యత తో ఉండాలనీ అన్నారు. గుండాల చర్చ్ లో సంఘ పెద్దలు సుధాకర్, అనొహు, అగస్టీన్, రమేష్,జోగయ్య, అమోస్,గోపి,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొడవటంచ చర్చ్ లో పాస్టర్ మార్క్ ప్రవీణ్ కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ మార్క్ మాట్లాడుతూ మానవాళి మనుగడ కు క్రైస్తవ్యం చాలా ముఖ్యమనీ ప్రతి మనిషి క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవిస్తే కష్టాలు నష్టాలు వుండవు అని అన్నారు. ఈ మానవాళి మనుగడ కోసం క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. ఈ వేడుకలు లో సుదర్శన్, బాలయ్య,రమేష్, తదితరులు పాల్గొన్నారు.