కలర్‌ఫొటో ఫేం సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ చిత్రంలో శివాని నాగరం హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని 2024 ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు.
