UPDATES  

 భారత్ వాణిజ్య నౌకలపై దాడులు.. రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..

ఇండియా వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.. కార్గో షిప్పులపై వరుసగా దాడుల జరుగుతున్న నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు ప్రకటించారు. ఈ దాడులకు పాల్పడిన వారిని సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వేటాడి, పట్టుకుంటామని స్పష్టం చేశారు. దీనికి కారణం అయిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ ’ను ముంబై వేదికగా నౌకాదళంలో ప్రవేశపెట్టిన సమయంలో నౌకల దాడి అంశాన్ని రాజ్ నాథ్ ప్రాస్తావించారు. ఎంవీ కెమ్‌ ప్లూటో వాణిజ్య నౌకపై డ్రోన్‌తో దాడి జరగడం వాస్తవమేనని భారత నేవీ ప్రకటించింది. గుజరాత్‌ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్‌ ప్లూటో’పై డిసెంబర్‌ 23న డ్రోన్‌ దాడి జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నౌకాదళం వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టింది. ‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ రక్షణతో ఆ వాణిజ్య నౌక ముంబై పోర్టుకి చేరుకుంది.

 

ఈ దాడి ఇరాన్‌ భూభాగంపై నుంచే జరిగిందని అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్‌ ప్రకటించింది. అయితే, అమెరికా ఆరోపణలను ఇరాన్‌ ఖండించింది. అమెరికా ఆరోపణలలో వాస్తవం లేదని ఇరాన్ ప్రకటించింది. అంతకుముందు ‘ఎంవీ సాయిబాబా’ నౌకపైనా దాడి జరిగింది. ఈ పరిణామాలతో కేంద్రం హెచ్చరించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !