మన్యం న్యూస్
భద్రాచలం నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న పొగ మంచు వలన వాహన దారులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు, మూడు రోజులు అధికంగా పొగ మంచు కురిసే అవకాశం ఉంది కావున నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.తెల్లవారుజామున ప్రయాణించే ఉద్యోగులు, వ్యవసాయదారులు, పొలం పనులకు వెళ్లేవారు కరెంటు పట్ల వివిధ పనులపై బయటకు వెళ్లే వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే రాష్టంలో ఈ సంవత్సరం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో తొలి కరోనా కేసు మరణం నమోదైనది అందుకని ప్రజలు రద్దిగా ఉండే ప్రదేశాల్లో, మార్కెట్, సంతలో కరోనా పట్ల తగిన జాగ్రత్తలు మాస్క్, శనిటైజర్ లను తీసుకోవాలని ఆయన సూచించారు.