దేశ రాజధాని ఢిల్లీలో కరోనా న్యూ వేరియంట్ జె.1 మొదటి కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరధ్వాజ్ ధ్రువీకరించారు. కాగా దేశవ్యాప్తంగా జె.1 కేసుల సంఖ్య ఇప్పటికే 100 దాటింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
