దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఏడు రోజులు హోం ఐసోలేషన్‌ను తప్పనిసరి చేసింది. ‘‘రాష్ట్రంలో JN.1 వేరియంట్ కేసులు 34కి చేరాయి. కరోనా కేసులు ఎక్కువగా బెంగళూరులో వస్తున్నాయి. ప్రజలు భౌతిక దూరం కూడా పాటించాలి’’ అని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దినేష్ గుండురావు పేర్కొన్నారు
