కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ చెన్నై జట్టును కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘క్రికెట్ ఔత్సాహికులందరం కలిసి క్రీడా స్ఫూర్తిని కొనసాగిద్దాం. తమిళనాడు టీమ్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ఈ టీమ్‌లో భాగం కావాలనుకున్న క్రీడాకారుల కోసం ఓ లింక్‌ను కూడా ఆయన షేర్ చేశారు.
