అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సమాజానికి కంటకంగా మారిన ఆర్జీజీ తల నరికి తెస్తే రూ.కోటి బహుమతి ఇస్తానని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ విరుచుకుపడ్డారు ఆర్జీవీ. ఈ నేపథ్యంలో తనకు ప్రాణ హాని ఉందంటూ ఏపీ డీజీపీకి నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌తో కలిసి కంప్లైంట్ ఇచ్చారు.
