టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్నట్లు సమాచారం. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇందులో భాగంగా మహేష్ లుంగీ కట్టుకుని ఊర మాస్ లుక్‌లో ఉన్న ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు.
