- మండలంలో వెలసిన దొంగ పోలీసులు
- పోలీసుల కంటే ముందుగానే కేసులు టేకప్ చేస్తున్న వైనం.
- నల్ల బెల్లం విక్రయించే వారే వీళ్ళ గురి
- నల్ల బెల్లం విక్రయించే వారి గుండెల్లో నిద్రపోతున్న కొసరు పోలీసులు .
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం
గత కొన్ని రోజులుగా, ఇరు మండలంలో పోలీస్ యంత్రాంగం మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు, గుడుంబా విక్రయాల పట్ల ఉక్కు పాదం మోపారు. కనిపించిన ప్రతి గుడుంబా అడ్డాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆకస్మిక మెరుపు దాడుల ద్వారా గుడుంబా విక్రయించేవారు కొంతమేరకు తగ్గుముఖం. పట్టారు. దాదాపుగా వాజేడు వెంకటాపురం మండలాలు పోలీస్ ఆధీనంలోకి వచ్చాయి. అయితే మద్యం విక్రయించేవారు వారి గుడుంబా కార్యకలాపాలు ఈ మండలాల్లో జరగకపోవడంతో చతిస్గడ్ ప్రాంతాలు అయినటువంటి తార్లగూడెం, దుద్దడ నుంచి ఎగుమతి చేసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్నిసార్లు అది కుదరకపోతే ఆయా ప్రాంతాల నుంచి నల్ల బెల్లం సాటుగా అడవి ప్రాంతంలో కాస్కోవడానికి వీలు కుదిరినప్పుడు గుట్టుగా రవాణా చేసుకో ని గుడుంబా ని కాస్తున్నట్టుగా ఆయా గ్రామాల్లో వినబడుతున్న అంశం. ఇదే అదునుగా దొంగ నల్లబెల్లం రవాణా ని గమనించిన కొంతమంది పాత్ర పురం మురుమూరు గ్రామానికి చెందిన యువకులు ఈజీ మనీ కి అలవాటై. గుడుంబా కాసేవారు చత్తీస్గడ్ ప్రాంతం నుంచి నల్లబెల్లాన్ని సరాపారా చేస్తున్న సమయంలో వాజేడు మండలం వై జంక్షన్ వద్ద మూకుమ్మడి దాడికి పాల్పడి తామే పోలీసులమని విక్రయించే వారిని బెదిరించి 50వేల రూపాయల విలువగల నల్ల పెళ్ళాన్ని అపహరించారని . అంతేకాకుండా చుట్టూ ఉన్నవారు ఫోటోలు వీడియోలు తీస్తున్న క్రమంలో పండు యాదవ్ అలియాస్ యశ్వంత్ అనే యువకుడు ఫోటోలు తీసే వాళ్ళని బెదిరించి సెల్లు లాక్కొని అందరిని స్టేషన్ లో వేస్తా అని బెదిరింపులకు పాల్పడినట్లు చుట్టూ ఉన్న వారు తెలిపారు. అపహరించిన నల్లబెల్లాన్ని తక్కువ రేట్ లోకి అమ్ముకొని. జల్సాలకు పాల్పడుతున్నట్టు గా మురుమూరు గ్రామానికి చెందిన గ్రామ ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు.. ఇలా చాలా కాలం నుంచి జరుగుతున్న ఈ దందా నేపద్యంలో ఈ దొంగ పోలీసులు అంటే గుడుంబా విక్రయదారుల గుండెలలో అనుక్షణం భయాందోళనలు రేకెత్తిస్తున్న ఛాయలు కనబడుతున్నాయి.. కొత్త ప్రభుత్వాల పథకాలఅమలు ప్రక్రియలో హడావిడిగా ఉన్న పోలీసు యంత్రాంగం కాస్త ఆలస్యంగా వారిని అదుపులోని తీసుకున్నారు.