మన్యం న్యూస్ బూర్గంపాహాడు:ఐటిసి ఎమ్మెస్ కే మమత సంస్థ హెచ్ఐఎంసి వారి ఆధ్వర్యంలో బు బూర్గంపహడ్ మండలంలో ప్రాజెక్టు ఐ టి సి ఎం ఎస్ కే మమత సంస్థ వర్కషాప్ నిర్వహించడం జరిగింది. ఐటిసి వారి సహకారంతో మమత సంస్థ నిర్వహిస్తున్న మాత శిశు సంరక్షణ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలలో అనీమియ నివారణ మరియు పోషకాహరం తీసుకోకపోవడం వల్ల పిల్లలలో కలిగే న్యూట్రీషియన్ లోపం గురించి తెలియచేయటం మరియు నివారించుటగురించి అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య , సీడీపీఓ.సీత, ఏసీడీపీఓ.సోనీ మరియు రేవతి, డాక్టర్.పూజ మరియు సువర్ణ, డాక్టర్.సాహితి, అంగన్వాడి టీచర్లు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, మరియు ఐటీసీ ఎంఎస్కే పిఓ సుజిత్రా, మమత సంస్థ నుండి డాక్టర్.ముఖేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
