మన్యం న్యూస్ గుండాల: గుండాల,ఆల్లపల్లి మండలలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది గుండాల మండలంలోని లింగాగూడెం, రోల్లగడ్డ, ఆళ్లపల్లి మండలంలోని అడవిరామారం గ్రామపంచాయతీలలో తొలి రోజు గ్రామ సభలను ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి, లింగగూడెం సర్పంచ్ సర్పంచ్ జనగం నరసింహారావు, రోళ్ల గడ్డ సర్పంచ్ అజ్మీర మోహన్ ఆధ్వర్యంలో ప్రజల నుండి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. మొత్తం అన్ని దరఖాస్తులకు కలిపి ఒకే ఫామ్ లో నింపి ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎల్ రంగ, ఎంపీడీవో సత్యనారాయణ అధికారులు పాల్గొన్నారు
