మన్యం న్యూస్ గుండాల: ప్రజా పాలన గ్రామసభను పడుగొని గూడెం గ్రామపంచాయతీ లో గల కొడవటంచ గ్రామంలో కూడా నిర్వహించాలని న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పరిషిక రవి అధికారులను కోరారు. కొడవటంచ గ్రామంలో నిర్వహించడం ద్వారా నాగారం, పాలగూడెం గ్రామ ప్రజలు అక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బందులకు గురవుతారని అన్నారు. అధికారులు స్పందించి గ్రామసభను కొడవటంచ గ్రామంలో కూడా నిర్వహించాలని కోరారు
