తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరో వెంకటేశ్ ప్రస్తుతం వెంకీ 75 సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా వెంకీ సినిమాటిక్ జర్నీ సెలబ్రేషన్ ఈవెంట్ చేయగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ చిరంజీవి లేకుంటే నేను సినిమాల వదిలి ఇప్పటికే హిమాలయాలకు వెళ్లేవాడినంటూ చెప్పుకొచ్చాడు. చిరు విరామం తర్వాత ఖైదీ నం150తో హిట్టు కొట్టడం చూసి మనసు మార్చుకున్నానని తెలిపాడు.
