పెగాసస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్లో యాపిల్ నుంచి హ్యాక్ అలర్ట్లు వచ్చిన తర్వాత ఇద్దరు భారతీయ జర్నటిస్టుల ఫోన్లలో తాము పెగసస్ సాఫ్ట్వేర్ను గుర్తించినట్లు ఎన్జీవో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం ప్రకటించింది. ‘ది వైర్’ పత్రిక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజ్ సహా మరో జర్నలిస్టు ఫోన్లను తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షించి వాటిల్లో పెగసస్ ఉన్నట్లు తేల్చిందని వెల్లడించింది.
