మన్యం న్యూస్ గుండాల: మూడు విప్లవ పార్టీలు ఐక్యత సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రజాపంథా పార్టీ నాయకులు సనప కుమార్ సోదరుడు మృతి చెందడంతో దశదినకర్మకు హాజరై అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు విప్లవ పార్టీలు ఐక్యతగా ఏర్పడుతున్న సమయంలో మార్చి మూడో తారీఖున భారీ బహిరంగ సభను ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత పార్టీకి ఉందని ఆయన పేర్కొన్నారు. విప్లవోద్యమ నిర్మాణం కోసం దేశంలో ఓకే బలమైన కమ్యూనిస్టు పార్టీ ఉండేందుకు నిర్మాణం కోసం ఈ పార్టీలు కృషి చేస్తాయని అన్నారు. ఈ పార్టీలన్నీ 17 రాష్ట్రాలలో నిర్మాణాత్మకంగా పనులు చేస్తున్నాయని వీటి కలయిక విప్లవ పార్టీలు బలపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సంశంకర్, మండల కార్యదర్శి శాంతయ్య, వెంకన్న, వాంకుడోత్ అజయ్, సింగన్న, తదితరులు పాల్గొన్నారు
