- మత్తులో చిత్తవుతున్న యువత.
- గంజాయి తో పట్టుబడ్డ యువకులు.
- 31వతారీకే విధిగా తరలిస్తున్నారని వెల్లడి..
- నిఘావేసినా పోలీసులకు
- చిక్కిన గంజాయి స్మగ్లర్లు
- భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.
శనార్తి తెలంగాణ వాజేడు.
మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా గంజాయి తరహా కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపై ఉక్కు పాదం మోపిన వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు వాజేడు మండలంలోని జగన్నాధపురం వై జంక్షన్ వద్ద వారి సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వెంకటాపురం నుండి జగన్నాధపురం వైపు అనుమాన స్థితిలో కారు మరియు ద్విచక్ర వాహనాలు వస్తుండగా ఆ వాహనాలను తనిఖీ చేశారు. వారు తనిఖీలలో కార్ డిక్కీలో ఒక బ్రౌన్ కలర్ టేపు వేసిన ప్యాకెట్ కనిపించిన నేపద్యంలో కార్ యజమానిని అదేంటని అడగగా భయపడి గంజాయి అని ఒప్పుకున్నారని వెంకటేశ్వర్లు తెలిపారు.మిగతా ద్విచక్ర వాహనాలు కూడా ఆపి వారిని క్షుణ్ణంగా పరీక్షించగా వారి దగ్గర కూడా విలువగల గంజాయి రెండు ప్యాకెట్లు లభించిందని స్పష్టం చేశారు. వెంటనే ఆ నలుగురు వ్యక్తులను బైక్ ని కారును అదుపులోకి తీసుకొని విచారింపగా ఆ విచారణలో దొరికిన వారు ఒళ్ళు గగుర్పాటుచే విషయాలు చెప్పినట్టు ఎస్సై తెలిపారు. వాలే కాకుండా ఇంకా తొమ్మిది మంది వెనక బైకుల మీద గంజాయిని పట్టుకొస్తున్నారని. విచారణలో తేలింది అని వాళ్లతో పాటు వస్తున్న రెండు బైకులు పోలీస్ తనిఖీలు చూసి పారిపోయారని వారు తెలిపారు. రెండు బైకుల మీద ఐదుగురు కలిసి మొత్తం 14 మందికి గంజాయి త్రాగే అలవాటు ఉందని అది త్రాగుట ద్వారానే అందరు స్నేహితులు అయ్యారని రాబోయే డిసెంబర్ 31 నాడు కలిసి సరదాగా గంజాయి త్రాగుతూ ఎంజాయ్ చేయాలని కొత్తగా గంజాయ్ ఎక్కువ ధరకు అమ్ముకుందామని అనుకొని తలా కొంత డబ్బు జమ చేసుకొని ఒడిస్సా రాష్ట్రంలోని కలిమెల గ్రామంలోకి వెళ్లి సుమారు నాలుగు కేజీల గంజాయి కొనుక్కొని వస్తున్నట్టుగా పోలీస్ విచారణలో వారు తెలిపారు. మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వారిపై పలు రకాల కేసులు నమోదు చేసినట్టుగా వ్యక్తం చేశారు. పట్టుబడ్డ వారి పేర్లు ఇలా ఉన్నాయి,.
చీడం సిద్ధార్థ సన్నాఫ్ కృష్ణ.
గజ్జల మధుకర్ సన్నాఫ్ రాములు తాడ్వాయి మండలం.
కర్రింగుల మధుకర్ సన్నాఫ్ భాస్కర్, తాడ్వాయి మండలం.
పందెల్ల సాయి సన్నాఫ్ శ్రీనివాస్ కొత్తూరు గ్రామం తాడ్వాయి మండలం.
పాయం సుధీర్ సన్నాఫ్ సుగుణాకర్, తాడ్వాయి మండలం కన్నెపల్లి గ్రామం.
వై సాకేత్ సన్నాఫ్ ముత్యాలరావు వాజేడు మండలం కొత్తూరు గ్రామం.
గండికోట అఖిల్ సన్నాఫ్ సాంబశివరావు మేడారం గ్రామం తాడ్వాయి మండలం.
ఈ దందాలో చిన్న బాలలు కూడా ఉన్నారు.
వారిపై బాల నేరస్తుల కేసులు
Jcl1 గా పాయం వర్షిత్ సన్నాఫ్ వెంకటేశ్వర్లు తాడ్వాయి మండలం నరసాపురం గ్రామం.
Jcl2 ఇరుప అభిషేక్ సన్నాఫ్ బుచ్చిబాబు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం. గా గుర్తించారు.
అంతేకాకుండా పారిపోయిన నిందితుల పేర్లు.
చెరుకూరి సందీప్ సన్నాఫ్
భాస్కర్ మేడారం గ్రామం.
బోడబోయిన వినయ్ సన్నాఫ్ నరసింహమూర్తి గుమ్మడిదొడ్డి గ్రామం వాజేడు మండలం.
కారం పవన్ పాండు సన్నాఫ్ వెంకటేశ్వర్లు ఇప్పగూడెం గ్రామం వాజేడు మండలం.
మడకన్ పృథ్వి సన్నాఫ్ నాగేశ్వరరావు అరుణాచల పురం వాజేడు మండలం గ్రామం.
మడకం పవన్ సన్నాఫ్ భీమయ్య మురుమూరు కాలనీ వాజేడు మండలం.
పట్టుకున్న వారి వద్ద నుండి సుమారు 3.7.2 0 కేజీల గంజాయిని మరియు హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ ap 20am 1260.33ap36m 4414. వాహనాలను మరియు వారి దగ్గర ఉన్న సెల్ఫోన్ సంబంధించిన వన్ని స్వాధీనం చేసుకున్నారు.
సుమారు వారి దగ్గర స్వాధీనం చేసుకున్న గంజాయితో కలిపి విలువ సుమారు4,43000 మరియు ఆరు ఫోన్లు. గా నిర్ధారించారు.