తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఓ ఖైదీకి నాలుగు వారాల పెరోల్ మంజూరు చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న అతని భార్య అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ ఢిల్లీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
