టాలీవుడ్‌లో 2023 సంవత్సరానికి గాను మొత్తంగా 63 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో కొన్ని సినిమాలు హిట్ కొట్టగా.. మరికొన్ని సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలల్లో.. ‘ఆదిపురుష్, భోళా శంకర్, ఏజెంట్, శకుంతల, రావణాసుర, బ్రో, ఆదికేశవ, గాండీవధారి అర్జున, హంట్’ తదితర చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
