ప్రస్తుత కాలంలో ఒక సినిమాను థియేటర్ లో చూడాలంటే కనీసం రూ.1000 ఖర్చు అవుతోంది. దీంతో చాలా వరకు ప్రేక్షకులు ఓటీటీలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో పీవిఆర్ సినిమాస్ కేవలం రూ.699 ఖర్చుతో 10 సినిమాలు చూసేందుకు అవకాశం కల్పించింది. పీవిఆర్ సబ్ స్క్రిప్షన్ ద్వారా నెలకు రూ.699 చెల్లించి ఏదైనా పీవిఆర్ థియేటర్ లో 10 సినిమాలను పాస్ ద్వారా వీక్షించవచ్చు. వీకెండ్ లో మాత్రం ఈ అవకాశం ఉండదు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు
