మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులకు పంచుకున్నారు. 1983లో సురేష్ ప్రొడక్షన్లో చిరంజీవి ‘సంఘర్షణ’ అనే సినిమా చేశారట. అప్పుడు నిర్మాత రామానాయుడికి రెండో అబ్బాయి ఉన్నాడని చిరంజీవికి తెలిసిందట. అతను ఎక్కడ ఇండస్ట్రీలోకి వస్తాడేమోనని చిరంజీవి చాలా భయపడ్డారట. ఆ సమయంలో తనకు సినిమాలపై ఆసక్తి లేదని చెప్పినప్పుడు ఊపిరి పీల్చుకున్నానని అన్నారు. అతనెవరో కాదు విక్టరీ వెంకటేశ్ అని చిరంజీవి చెప్పారు.
